Wednesday, May 1, 2024

జీతం రూ.6 వేలు.. రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటి నోటీసు

- Advertisement -
- Advertisement -

IT-dept

భోపాల్: అతని జీతం నెలకు రూ. 6,000. అయితే రూ. 3.49 కోట్లు ఆదాయం పన్ను కట్టాలంటూ ఐటి శాఖ అతనికి నోటీసు పంపించింది. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో చోటు చేసుకుంది. భిండ్‌కు చెందిన రవి గుప్తా నెల జీతం రూ. 6,000. అయితే రూ. 3.49 కోట్లు కట్టాలంటూ ఐటి శాఖ తనకు నోటీసు పంపిందని గుప్తా తెలిపాడు. 2011లో తన పాన్‌కార్డ్, ఫోటోతో ఒక బ్యాంకు ఖాతా తెరిచారని, అందులో రూ. 132 కోట్ల లావాదేవీలు జరిగాయని రవి గుప్తా చెప్పాడు. అయితే ఆ బ్యాంకు ఖాతాను తాను తెరవలేదని అతని వాపోయాడు. అసలు నేరస్థులను వదిలేసి ఐటి శాఖ తనకు నోటీసులు పంపిందని, తన పాన్‌కార్డుతో ఎవరు బ్యాంకు ఖాతా తెరిచారో తనకు అంతుపట్టడం లేదని అతను చెప్పాడు.

IT dept sent notices to layman, Ravi Guptas monthly salary is Rs 6k per but IT dept sent notices to him asking to pay Rs 3.49 cr

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News