Thursday, May 2, 2024

ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలువండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బిజెపికి 1000 వార్డులు, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులు లేరని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్  ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపిలో బీ ఫారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదన్నారు. తెలంగాణ భవన్ నుంచి టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులతో కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు.  రూ.45 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, దేశంలో ఒక్క టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తోందన్నారు.  నిజామాబాద్, సిరిసిల్ల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్న బిడి కార్మికులను ఆదుకునేందుకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. దేశంలో బిడి కార్మికులను ఆదుకుంటున్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని ప్రశంసించారు.

పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆదుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీల్లో 7 నుంచి 10 గంటలు కరెంట్ కట్ ఉండేదని, కానీ ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఆ పరిస్థితి లేదన్నారు. నాడు, నేడు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలన్నారు. 75 గజాల ఇంటి స్థలం ఉన్న వారికి 22 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని, కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని, దేశంలో తెలంగాణ మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కెటిఆర్ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పది శాతం బడ్జెట్ గ్రీనరీ కోసం కేటాయించామన్నారు.

ఎక్కడికక్కడా లోకల్ మేనిఫెస్టోలు రూపొందించుకొని ప్రచారం చేయండని స్థానిక టిఆర్‌ఎస్ నేతలకు సూచించారు. ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి ఓటర్లను కలువాలని పేర్కొన్నారు.  గెలుపు టిఆర్‌ఎస్‌దేనని, అతి విశ్వాసంతో ఉండకుండా ప్రచారాన్ని వేగవంతం చేయండని పిలుపునిచ్చారు. 3 లక్షల 75 వేల ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేశామని, మున్సిపాలిటీల్లో 35 నుంచి 45 శాతం డబ్బులు ఆదా అవుతున్నాయని, పట్టణాల్లో ఇప్పటికే మిషన్ భగీరథలో భాగంగా బల్క్ వాటర్ సప్లై అందిస్తున్నామని, పట్టణాలకు ప్రత్యేక నిధులు ఇస్తున్నామని, కార్పొరేషన్లకు బడ్జెట్‌లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులిస్తుందని, ఇప్పటికే టియుఎఫ్‌డిసి ద్వారా రూ.25 వందల కోట్లతో పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేశామని కెటిఆర్ వివరించారు.

 

KTR tele conference with Counselors, Corporators
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News