Thursday, May 16, 2024

పిల్లలు సూపర్ మార్కెట్ ఉత్పత్తులు కాదు: ఇటలీ ప్రధాని

- Advertisement -
- Advertisement -

రోమ్ : సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మాతృత్వాన్ని పొందటం అమానవీయమని, ఈ పద్ధతిలో జన్మించిన పిల్లల్ని సూపర్ మార్కెట్ ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యలు చేశారు. “ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛాచర్య అని మీరు నన్ను ఒప్పించలేరు. పిల్లల్ని సూపర్ మార్కెట్‌లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమ అని మీరు నాకు సర్దిచెప్పలేరు. గర్బాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ అమానవీయంగా భావిస్తాను. ” అని మెలోనీ వ్యాఖ్యానించారు.

దీనిని అంతర్జాతీయ నేరంగా మార్చే బిల్లుకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. సరోగసీ ప్రక్రియ ఇప్పటికే ఇటలీలో శిక్షార్హం. అతివాద భావజాలం కలిగిన అధికార పక్షం ఈ నిబంధనలను మరింత కఠిన తరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం చట్టబద్ధమైన దేశాల్లో కూడా ఇటలీ ప్రజలు పిల్లల్ని కనకుండా ఈ బిల్లు నిషేధించనుంది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News