Tuesday, April 23, 2024

ప్రాణం నా ప్రాణం…

- Advertisement -
- Advertisement -

Jaanu movie

 

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జాను’. ఈ సినిమాలోని తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “ప్రాణం నా ప్రాణం… నీతో ఇలా… గానం తొలి గానం పాడే వేళ” అంటూ సాగే హార్ట్ టచింగ్ మెలోడి ప్రేమలోని గాఢతను తెలియజేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః మహేంద్రన్ జయరాజ్, సంగీతంః గోవింద్ వసంత, మాటలుః మిర్చి కిరణ్, పాటలుః సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి.

Jaanu movie lyrical video song release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News