Thursday, May 2, 2024

గజదొంగల ముఠా ఎపిని దోచేసింది: జగన్

- Advertisement -
- Advertisement -

కర్నూలు: ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న చేదోడు నిధులను సిఎం విడుదల చేశారు. వరసగా నాలుగో ఏడాది పథకం అమలు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పది వేల రూపాయల చొప్పున సాయం చేశారు. సిఎం జగన్ చేతుల మీదుగా ఈ సంవత్సరం రూ.325.02 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకంతో 3 లక్షల 25 వేల 020 మంది రజకులు లబ్ధి పొందనున్నారు.

ఈ పథకం నాయీ బ్రాహ్మణలు, టైలరింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు అమలు కానుంది. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూడాలని ప్రజలు అడిగారు. ప్రతి అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకొని నడిపిస్తున్నామని, వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా 19,178 కోట్లు అందజేస్తున్నామని జగన్ వివరించారు. నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నామన్నారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిందని, అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ ఉందని కానీ టిడిపి పాలనలో అభివృద్ధి జరగలేదని జగన్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారని, ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొచ్చారని, ఎన్నికల తరువాత చెత్తబుట్టలో పడేశారని దుయ్యబట్టారు. కుప్పంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News