Thursday, May 2, 2024

పాన్ ఇండియా మూవీగా పూరి డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూరి జగన్నాథ్ తాను ఖచ్చితంగా ‘జనగణమన’ మూవీ తీస్తానని అంటున్నాడు. “జనగణమన అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అతి త్వరలో దాన్ని తీయడానికి ప్లాన్ చేస్తున్నా”అని ఆయన చేసిన ప్రకటనను పూరి కనెక్ట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎంతో కాలంగా ‘జనగణమన’ చిత్రాన్ని తీయాలని పూరి జగన్నాథ్ అనుకుంటూ వస్తున్నారు. అయితే ఇంతవరకు అది వాస్తవ రూపం దాల్చకపోవడంతో ఈ సినిమా ఇక రాదేమోనని అనుకున్నారు. అయితే, తాజా ప్రకటనతో పూరి ‘జనగణమన’ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతుందని స్పష్టం చేశారు. ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్‌ను లాక్‌డౌన్ సమయంలో ఆయన పూర్తి చేశారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని సమాచారం.

‘Jana Gana Mana’ my dream project: Puri Jagannath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News