Friday, April 19, 2024

కర్నాటకలో కలిసి పోటీ

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ సూచనలు, సలహాలతో కూటమిని అధికారంలోకి తెస్తాం అన్ని రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్
ప్రభావం ఖాయం తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు
బెంగళూరులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ విధానాలపై కన్నెర్ర చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇక ఢిల్లీ వేదికగానే బిజెపి ప్రభుత్వంపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చారు. దానికి భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అన్న పేరును నామకరణం చేశారు. ఈ పార్టీ పేరుతోనే జాతీయ స్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో చేటుచేసుకుంటున్న పరిణామాలను దేశంలోని బిజెపియేతర ప్రభుత్వాలతో పాటు అనేక పార్టీలు నిషితంగా గమనిస్తున్నాయి. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసే విధంగా కెసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న పథకాలకు దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడానికి అనేక పార్టీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్, చత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని పలు పార్టీలు కెసిఆర్‌తో కలిసి పనిచేయడానికి సమాయత్తం అవుతున్నాయి. వారిలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కుమారస్వామి అందరి కంటే ముందువరసలో ఉన్నారు. ఒక్క అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో కలిసే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోతామని ఆయన బహిరంగ ప్రకటన చేశారు. ఈ మేరకు గురువారం ఆయన బెంగళూరులో మాట్లాడారు. తమ పార్టీ శాసనసభ్యులంతా కెసిఆర్ పార్టీతో కలిసి ముందుకు సాగుతామన్నారు. ఈ సందర్భంగా వారిచ్చే సూచనలు, సలహాలు స్వీకరించి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జెడిఎస్, బిఆర్‌ఎస్ కూటిమిని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. కేవలం కర్నాటకలోనే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రంలో బిఆర్‌ఎస్ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గురువారం కర్నాటకలో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాలను వెల్లడించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు చేయాల్సిన అవసరముందన్నారు. కాగా గతంలో పలు సందర్భాల్లో కెసిఆర్ బెంగళూరు వెళ్లి జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడను, కుమారస్వామిని కలిసొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కుమార స్వామి సైతం గతంలో హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్‌లో కెసిఆర్ ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్లారు. ఇలా కెసిఆర్‌తో చాలా కాలంగా వారికి మంచి రాజకీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగానే కెసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియలో కుమారస్వామి స్వయంగా వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌పై ఆయన ప్రసంశల జల్లు కూడా కురిపించారు. సామాజికవర్గంపై రైతులపై కెసిఆర్‌కు ఉన్న కమిట్‌మెంట్ గొప్పదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

JDS and BRS to contest together in Karnataka Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News