Friday, March 29, 2024

రేపటి నుంచి జేఈఈ మెయిన్

- Advertisement -
- Advertisement -

jee-main

11 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్)కు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 6 నుంచి 11 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి. మొదటి షిఫ్టు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జెఇఇ మెయిన్ 2020 జనవరిలో, రెండవ జెఇఇ మెయిన్ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది. ఒక అభ్యర్థి ఈ రెండు పరీక్షలకూ హాజరు కావచ్చు. జెఇఇ పరీక్షల ఫలితాలు ఈ నెల 31వ తేదీన వెలువడనున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి 75 వేల మంది

జెఇఇ మెయిన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 75 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ నగరాలలో జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సారి జెఇఇ మెయిన్ రాసే విద్యార్థుల కోసం తెలుగులో కూడా పరీక్షను నిర్వహించనున్నారు. దీంతో గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.

మార్చి 27 నుంచి నీట్ హాల్ టికెట్లు

దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో ఎంబిబిఎస్,బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న మే 3వ తేదీన నిర్వహించనున్న ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2020’ సంబంధించిన హాల్ టికెట్లు(అడ్మిట్ కార్డు) మార్చి 27వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’ (నీట్ యుజి 2020) దరఖాస్తుకు గడువు సోమవారం (జనవరి నెల 6వ తేదీ) రాత్రి 11:50తో ముగియనుంది. కాగా ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలు చేసుకునేందుకు గడువు యధాతధంగా అంటే జనవరి 15 నుంచి 31 వరకు ఉంటుందని వారు ఎంహెచ్‌ఆర్‌డి వర్గాలు వివరించాయి.

jee main 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News