Tuesday, April 30, 2024

నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

JEE Main exams

 

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్)కు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు జరుగనున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 9.34 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, తెలంగాణ నుంచి సుమారు 75 వేల మంది మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనవరి 6 నుంచి 11 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి.

మొదటి షిఫ్టు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జనవరి 6వ తేదీన(సోమవారం) రోజు బి.టెక్, బి.ప్లాన్ ప్రవేశాల కోసం నిర్వహించే పేపర్2 పరీక్ష జరుగనుండగా, బి.ఇ, బి.టెక్ ప్రవేశాల కోసం జనవరి 7వ తేదీ(మంగళవారం) నుంచి పరీక్షలు జరుగనున్నాయి. జెఇఇ మెయిన్‌కు సంబంధించిన జవాబుల కీ ని ఈ నెల మూడవ వారంలో విడుదల చేయనుండగా, ఫైనల్ కీ ని చివరి వారంలో విడుదల చేయనున్నారు. జెఇఇ మెయిన్ ఫలితాలను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.

పెన్నులూ పరీక్షా హాల్లోనే
జెఇఇ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) స్పష్ట చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైనపెన్నులు, పెన్సిల్‌లను కూడా పరీక్షా హాల్లోనే అందజేస్తామని తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు రఫ్ వర్క్ చేసుకోవడానికి అవసరమైన పేపర్లు కూడా పరీక్షా హాలులోనే అందజేస్తారు. రఫ్ పేపర్లపై విద్యార్థులు తప్పనిసరిగా తమ హాల్‌టికెట్ నెంబర్ రాసి, పరీక్ష ముగిసిన తర్వాత ఆ పేపర్లను, అడ్మిట్ కార్డును ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, జామెట్రీ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలేవీ వెంట తీసుకురావద్దని ఎన్‌టిఎ వెల్లడించింది.

విద్యార్థులు రిపోర్టింగ్ సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. పరీక్ష ప్రారంభ సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. స్కూళ్లు, కాలేజీలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ రశీదులను గుర్తింపు కార్డుగా పరిగణించరు. పరీక్షా కేంద్రంలోకి తినుబండారాలు, టీ, కాఫీ,కూల్ డ్రింక్స్ వంటివి పరీక్షా హాలులోకి అనుమతించరు.

JEE Main exams from today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News