Saturday, May 11, 2024

జేఈఈ మెయిన్ ఫైనల్ కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత (సెషన్ 1) తుది కీ సోమవారం విడుదలైంది. గత నెల 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు నిర్వహించిన జెఇఇ మెయిన తొలి విడత పరీక్ష ఫైనల్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలు వెల్లడించనున్నారు.

తొలి విడత పేపర్- 1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్‌టిఎ వెల్లడించింది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బి.ఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బి.ప్లానింగ్) సీట్ల భర్తీకి గత నెల 24న నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News