Sunday, May 19, 2024

మల్లేపల్లి ఐటిఐలో 25న మినీ జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

Job Mela

హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 25న మల్లేపల్లి బాలురు ఐటిఐ క్యాంపస్ సమీపంలోని ఉపాధి కార్యాలయం లో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అపోలా ఫార్మసీ, క్యూసిస్ క్రాప్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిబిఐ ఫెడరల్, వసంత టూల్ క్రాఫ్ట్, ఇన్నోవా సోర్స్ ప్రైవేటు, నేత అంబిట్, ఆర్‌ఎస్ బిజినెస్ సపోర్టు వంటి 07 కంపెనీలలో పనిచేయుటకలు దాదాపు 400 ఉద్యోగాల ఎంపికకు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు. పదవతరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లామా, బిఫార్మసీ, ఎంఫార్మసీ, బికాం, ఐదైనా డిగ్రీ ,పిజి, బిటెక్ చదవిన అభ్యర్దులు అర్హులన్నారు.

ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, ఫార్మాసిస్ట్, అసిస్టెంట్, ట్రైనీస్, పైనాన్సియల్ అడ్వైజర్, కస్టమర్ సపోర్టు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ప్రమోటర్స్ , సిఎన్‌జి మిల్లింగ్ ఆపరేటర్, ఈడిఎం ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు ఇంటర్వూలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్దులకు నెలకు రూ.10వేల నుండి రూ. 20వేలవరకు ఇవ్వనున్నట్లు, వయస్సు 19 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న స్త్రీలు,పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల యువకులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ జీరాక్స్ కాఫీలతో 25వ తేదీ శనివారం ఉదయం 10.30గంటలకు హజరు కావాలని కోరారు.

 

Job Mela in Mallepally ITI Campus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News