Tuesday, April 16, 2024

నకిలీ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా

- Advertisement -
- Advertisement -

Job-racket

న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఒక నకిలీ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగాలు ఇస్తామన్న సాకుతో నిరుద్యోగులను మోసం చేసిన ముంబయికి చెందిన సంకేత్ ఝా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. యో ఎయిర్ అనే నకిలీ ఎయిర్‌లైన్ కంపెనీ పేరుతో దాదాపు 250 మందిని సంకేత్ ఝా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని మెట్రోపాలిటన్ హోటల్ వద్ద జరుగుతున్న గొడవ గురించి మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చింది.

యో ఎయిర్ ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ సిబ్బంది నియామకాల కోసం ఇంటర్వూలు జరుగుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు తెలిసిందని యుపిలోని నోయిడాకు చెందిన షిప్రా సింగ్ వ్యక్తి పోలీసులకు తెలిపారు. అయితే ఇంటర్వూ కోసం తాను హోటల్‌కు వెళ్లగా ఉద్యోగం కావాలంటే రూ. 2.55 లక్షల డిడి ఇవ్వాలంటూ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనను అడిగిందని ఆమె చెప్పారు. యో ఎయిర్ అనేది ఒక నకిలీ కంపెనీ అని తనకు తెలిసిందని , తనతో పాటే ఇంటర్వూకు దాదాపు 250 మంది వచ్చారని ఆమె చెప్పింది. వెంటనే మెట్రోపాలిటన్ హోటల్‌కు చేరుకున్న పోలీసులు నకిలీ కంపెనీతో నిరుద్యోగులను మోసం చేస్తున్న సంకేత్ ఝాని అరెస్టు చేశారు.
Job racket busted by Delhi police, In the pretext of providing jobs in fake Thailand airline one Sanket Jha cheated people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News