Sunday, September 21, 2025

ఆ స్టార్‌తో నటిస్తానంటోంది

- Advertisement -
- Advertisement -

ధీరోదాత్త కంగన రనౌత్‌తో కలిసి నటించాలని ఉందని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోని కంగన చూసింది. ఇప్పుడు ఆమె దానికి స్పందించింది. ఆ మీమ్ పేజ్ కి ఆమె స్పందిస్తూ దండం ఇమేజ్ పెట్టింది. అంటే ఆమె ఆనందాన్ని అలా వ్యక్తపరిచింది. కంగన తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో అవకాశం వస్తే ఈ భామ ఆనందంగా ఒప్పుకునేలా ఉంది. ప్రస్తుతం ఇద్దరూ ఒకే రాజకీయ గ్రూప్ లో ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షం. ఇక కంగన బీజేపీ ఎంపీగా కొనసాగుతోంది. ఇద్దరూ హిందూ ధర్మం గురించి ప్రకటనలు ఇస్తారు. కాబట్టి ఇద్దరూ కలిసి నటిస్తే అదిరిపోతుందని చెప్పొచ్చు. అయితే కంగనకి పవన్ కల్యాణ్ తో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News