Saturday, June 3, 2023

కన్య రాశి వారు శుభాలు పొందినా.. అధికంగా ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

కన్య…
–వీరికి ఆదాయం –2, వ్యయం–11 రాజపూజ్యం–4 అవమానం–7.

వీరికి శని మినహా గ్రహాలస్థితిగతులు అంతగా అనుకూలం కాదు. గురుడు ఏప్రిల్21 నుండి అష్టమస్థితి సంచారం, రాహువుతో కలయిక మరింత క్లిష్టంగా ఉండే అవకాశం. ఇక శని సంచారం శుభఫలితాలు ఇస్తుంది. మొత్తం మీద వీరు కొన్ని శుభాలు పొందినా అధికంగా ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. నిరుద్యోగ యువతకు శుభపరిణామాలు. ఉద్యోగలాభం. ఆదాయపరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. బంధువులు, స్నేహితుల మనోభావాలను గుర్తించి మసలుకోవడం అవసరం. ఒక పరిచయస్తుని ద్వారా అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. బియ్యం మిల్లులు, ఫైనాన్స్రంగంలోని వారికి అనుకూల పరిస్థితులు.

ఇంటి నిర్మాణాల్లో జాప్యం లేకుండా పూర్తికి కృషి చేస్తారు. ఏప్రిల్– అక్టోబర్మధ్య కాలంలో అష్టమంలో గురుఛండాల యోగం వల్ల కీలక వ్యవహారాలలో తొందరలేకుండా ముందుకు సాగాలి. ఆరోగ్యంపై అత్యధిక శ్రద్ధ వహించడం మంచిది. ఉదరం, నరాల బలహీనత వంటి రుగ్మతలు బాధపెట్టవచ్చు. వ్యాపారస్తులు లాభాలు అందుకున్నా ఏదో ఒక వివాదం వెంటాడుతునే ఉంటుంది. భాగస్వాములతోనే విభేదాలు రావచ్చు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా మెలుగుతూ చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. వీరిపై నిఘా పెరిగే సూచనలు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవర్గాలు సమస్యలతోనే గడుపుతారు. కళాకారులు అవకాశాలు చేజేతులా పోగొట్టుకుంటారు. సాంకేతికరంగం, వైద్యులు, శాస్త్రవేత్తలకు కొంత అనుకూలంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమతో కొన్ని విజయాలు అందుకుంటారు. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. జ్యేష్ఠం, ఆషాఢం, మార్గశిరం, పుష్యమాసం అనుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి.
వీరు శని, గురుడు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News