Friday, April 26, 2024

మరోసారి తల్లి కాబోతున్న కరీనా..

- Advertisement -
- Advertisement -

Kareena Kapoor announces her 2nd Pregnancy

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతోంది. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని సైఫ్ అలీఖాన్, కరీనా ప్రకటించారు. 2102లో పెళ్లి చేసుకొని ఒక్కటైన సైఫ్, కరీనాకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. 2016లో ఈ జంటకు తైమూర్ అలీఖాన్ జన్మించాడు. “మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు” అని సైఫ్, కరీనా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక తాజాగా కరీనా కపూర్ బాలీవుడ్‌లో ఉన్న నెపొటిజంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “స్టార్స్ పిల్లలు సినిమాల్లోకి రావాలని కోరుకునేది ప్రేక్షకులే. స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వస్తే వారిని మళ్లీ స్టార్స్‌ను చేసేది ప్రేక్షకులే. అంటే ఇక్కడ ప్రేక్షకుల వల్లే స్టార్ కిడ్స్ స్టార్స్ అవుతున్నారు. స్టార్స్ పిల్లలు స్టార్స్ కావద్దనుకున్నప్పుడు ప్రేక్షకులు వారి సినిమాలను చూడకుంటే సరిపోతుంది. వారి సినిమాలు విడుదలైనప్పుడు చూడకుండా ఉన్నట్లయితే ఒకటి, రెండు సినిమాలతోనే వారి కెరీర్ ముగుస్తుంది. స్టార్ కిడ్స్ పిల్లల సినిమాలను చూడమంటూ ప్రేక్షకులను ఎవరు కూడా ఒత్తిడి చేయరు”అని పేర్కొంది.

Kareena Kapoor announces her 2nd Pregnancy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News