Sunday, May 5, 2024

మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లను తెరాసనే గెలుచుకుంని క్లీన్ స్వీప్ చేస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఎం మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై, ప్రచార కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంఎల్ఎలు తమ పరిధిలోని కార్యకర్తలతో, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అందరూ అభ్యర్థి విజయానికే పాటుపడాలన్నారు. మనకు ఏ పార్టీ పోటీ కాదని, కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయిందని.. ఇక, బిజెపి తమకు రాష్ట్రంలో పట్టుందని సొంత డబ్బా కొట్టుకుంటుందని కెసిఆర్ ఎద్దేవా చేశారు.  ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించిందని, ఈ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని సిఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, జెడ్పి చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యలు పాల్గొన్నారు.

KCR Speaks in Extensive Meeting at Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News