కోల్‌కతా: ఐపిఎల్ 18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఉత్కంఠ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఆఖరిబంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతికి 3 పరుగులు చేయలేక ఓటమికి బొక్క బోర్లాపడింది రాజస్థాన్. భారీ లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్ బ్యాటర్లలో శుభమ్ దూబే(25 నాటౌట్) జట్టును గెలిపించుకునేందుకు ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఆండ్రీరస్సెల్(57 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రఘువంశీ(44), రెహ్మానుల్లా గుర్బాజ్(35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో రింకూ సింగ్(19 నాటౌట్) మెరుపులు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్‌కతా భారీ స్కోరు నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యధ్వీర్ సింగ్, మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. రియాన్ పరాగ్(95) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో అతను ఔటవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్లో మరోసారిరాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(34), సిమ్రాన్ హెట్మేయిర్(29) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివర్లో శుభమ్ దూబే పోరాడినా ఫలితం దక్కలేదు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, మోయిన్ అలీ రెండేసివికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
చివరి ఓవర్‌లో హైడ్రామా.. వైభవ్ అరోరా వేసిన ఆఖరిఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 6 బంతుల్లో 22 పరుగులు అవసరమవ్వగా.. ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే వరుసగా 6, 4, 6లతో విరుచుకుపడి మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపాడు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరమవ్వగా.. రెండు పరుగులు తీసే క్రమంలో ఆర్చర్ రనౌటయ్యాడు. దాంతో రాజస్థాన్‌కు ఒక్క పరుగు మాత్రమే దక్కింది. దీంతో కోల్‌కతా ఒక్క పరుగులు తేడాతో గెలిచింది. వీరోచిత ఇన్నింగ్స్‌లో సెంచరీ దిశగా దూసుకుపోతున్న రియాన్ పరాగ్ ఔట్ చేసి హర్షిత్ రాణా మ్యాచ్‌ను కోల్‌కతా వైపు మలుపు తిప్పాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు
సెంచరీ మిస్ చేసుకున్న ఈ విధ్వంసకర బ్యాటర్ రియాన్ పరాగ్ ఐపీఎల్లో వరుసగా 6 సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. మొయిన్ అలీ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొదటి బంతికి సిమ్రాన్ హెట్మెయిర్ సింగిల్ తీయగా.. అనంతరం రియాన్ పరాగ్ 5 బంతులను బౌండరీ అవతలకు బాదాడు. మొయిన్ అలీ ఒక వైడ్ కూడా వేశాడు. ఇలా మొయిన్ అలీ వేసిన 13వ ఓవర్లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. అనంతరం వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లో ఎదర్కొన ఒక బంతిని సిక్సర్ బాదాడు. ఇలా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రియాన్ పరాగ్ నిలిచాడు. ఐపిఎల్ చరిత్రలో ఒక బ్యాటర్ వరుసగా 6 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.