Tuesday, April 30, 2024

బిఆర్‌ఎస్ పార్టీని బొంద పెడతాం: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొందపెడుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం నల్లగొండలో మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకట్ రెడ్డి మాట్లాడారు. కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనడంతో… బచ్చాగాడు రాజకీయలు తెలియవని ఊరుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం కెసిఆర్ మూర్ఖత్వానికి అర్థం వస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు తలుచుకుంటే బిఆర్‌ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.

తాము తలుచుకుంటే 30 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపి సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. జూన్ 5 నుంచి పాలనపై దృష్టి పెడుతామని చెప్పారు. కెసిఆర్ పాస్ పోర్ట్ దొంగ అని, కష్టపడి సిఎం పదవి దక్కించుకున్న రేవంత్‌కు, నీకు పోలికా అంటూ చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ రాలేదని, కూతురు తీహార్ జైల్లో ఉన్న కనీసం బెయిల్ తెచ్చుకునే ప్రయత్నంచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లుడు హరీష్ రావు, కొడుకు కెటిఆర్ తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని, యాదాద్రి థర్మల్ ప్లాంట్ వ్యవహారంలో జగదీశ్ రెడ్డి జైలు వెళ్తాడని పరోక్షంగా ఆరోపణలు చేశారు. మెదక్‌లో 1000 కోట్లు ఖర్చు చేసిన బిఆర్‌ఎస్ గెలవదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News