Thursday, April 25, 2024

కాంగ్రెస్ లో కుతకుతలు

- Advertisement -
- Advertisement -

మునుగోడులో ప్రచారానికి
దూరంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
15న ఫ్యామిలీతో కలిసి
విదేశాలకు ప్రయాణం..?
వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ
అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు

Komatireddy Venkat Reddy demond Revanth Reddy says Apology
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లే దు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారం భం కావడంతో రాజకీయ వేడి మరింతగా పెరిగింది. ము నుగోడులో గెలుపే లక్షంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో గతానికి భిన్నంగా ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడ క ముందే తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూపంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ తరపున మునుగోడులో ప్రచారం చేస్తారా? లేదా? అనేది తెలియ డం లేదు. బిజెపి నుంచి బరిలో నిలుస్తున్న రాజగోపాల్‌రెడ్డి తన సొంత సోదరుడు కావడంతో వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటారనే ప్రచారం సాగింది. అయితే గత నెల లో ఓ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడులో ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

కానీ మునుగోడులో కాంగ్రెస్‌కు మద్దతుగా ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, పాజిటివ్‌గా మాట్లాడటం గానీ జరగలేదు. అయితే పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా వెంకట్‌రెడ్డిని తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని కోరా రు. మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తాను కూడా వస్తానని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారని స్రవంతి చెబుతున్నారు. ఆదివారం సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుమానం వద్దని, పార్టీ విజయం కోసం ఆయన పనిచేస్తారని చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 15న కుటుంబసభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాలని వెంకట్‌రెడ్డి నిర్ణ యం తీసుకున్నారని ఆయన స న్నిహిత వర్గాలు చెబుతున్నా యి. దాదాపు 20 రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో అక్కడే ఉండనున్నారని, మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాతే ఆయన హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అ యితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కలిసి వ స్తుందనే టాక్ ఉంది. అయితే ఇప్పు డు ఆయన ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్‌కు కొద్ది పాటి షాకింగ్ విషయమనే చెప్పాలి. మరి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరైనా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మనసు మార్చే ప్రయత్నాలు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి రాకపోయినా పార్టీకి పెద్దగా నష్టం జరగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉం డగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉండదు. ఒకవేళ ఉప ఎన్నిక ప్రచారానికి, రాహుల్‌గాంధీ పాదయాత్రకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

సస్పెండ్ చేయండి

ఇక, మునుగోడుకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయోజనాలకు విరుద్ధంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. వెంకట్‌రెడ్డి తన సోదరుడు, బిజె పి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కో రుతున్నట్లు ఆరోపణలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి గత మూ డేళ్లుగా బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నారని స్వయంగా అంగీకరించారని, వెంకట్‌రెడ్డి కూడా తన సోదరుడి బాట లో నడుస్తారా అనే సందేహం తమకు ఉందని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News