Monday, April 29, 2024

తెలంగాణకు 140, ఎపికి 84 టిఎంసిలు

- Advertisement -
- Advertisement -
Krishna-Board
మే 31 వరకు కృష్ణ నీటి వాటాల కేటాయింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మే 31 వ రకు 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 140 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌కు 84 టిఎంసిల కృష్ణా జలాలను కేటాయించింది. గు రువారం జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్‌కె గుప్తా నేతృత్వంలో జరిగిన 11వ జనరల్ బాడీ మీ టింగ్‌కు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హా జరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎపి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సిఎస్ ఆదిత్యనాధ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద సమయంలో వినియోగించుకున్న నీటి విషయంపై బోర్డు చర్చించింది.

ఆర్‌కె గుప్తా మా ట్లాడుతూ, వరద సమయంలో నీటి విషయం పై చర్చించినట్లు తెలిపారు. అదనపు 45 టిఎంసిలను పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ కోరిందని అన్నారు. అదేవిధంగా గృహవినియోగజలాలను 20 శాతం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ లేవనెత్తుతోన్న అంశాలను సిడబుల్‌యుసికి నివేదించనున్నట్లు వివరించారు. విభజన చట్టప్రకారం కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఉం డాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు అవసరానికి కంటే ఎక్కువ నీటిని కేటాయించామని బోర్డు కమిటీ సభ్యుడు పరమేశ్ తెలిపారు. నిష్పత్తి ప్రకారం కాకుండా అవసరాల మేరకు కేటాయించామని ఆయన చెప్పారు. ఇప్పటి వ రకు ఎపి 511 టిఎంసిలు, తెలంగాణ 158 టి ఎంసిల నీటిని వినియోగించాయని పరమేశ్ పేర్కొన్నారు.

Krishna Board Allocates 140 TMC Water to Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News