మన తెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ‘రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం అని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌కు చెం దిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి (సీనియర్ గైనకాలజిస్ట్) కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సం దర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన స మావేశంలో కేటీఆర్ , కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వా ల వైఫల్యాలను ఎండగట్టారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారని, సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్ర యోగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దాష్టికాన్ని మేము వదిలిపెట్టం. ఎస్సీ, ఎస్టీ, మానవ హ క్కుల కమిషన్ల దృష్టికి తీసుకు వెళతామన్నారు. రై తులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ’మొహబ్బత్ కీ దుకాణ్’? పాత రోజులు తెస్తానన్న రేవంత్‌రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీ ళ్లు తెప్పిస్తున్నాడని, ఈ దుస్థితి తెలంగాణకు ఎం దుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నా రు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు త గ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? దోచుకున్న ఆ
డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలన్నారు. మో డీ, చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. ‘చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగ డ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుం టే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధా లు ప్రచారం చేశారన్నారు. ఓటమిలో మన అధినాయకుడి తప్పు ఏమాత్రం లేదు..నాయకులుగా మనమే విఫలం అయ్యామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలవికానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులు ఎత్తేసిందని, దీనిని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సం స్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు.
పదేళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ బాగా పనిచేశారని, దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని అనే పనులు చేసి చూపించారని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్టేట్‌గా నిలిపారని, అయినా ఓడిపోయామంటే అందుకు మనమే కారణమన్నారు. మన నాయకుడు బాగా పనిచేశారని, మనమే ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం అయ్యామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఓటమిపై మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఏంటి?, మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అనే దానిపై అందరూ ఆరా తీయాలని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుం చి 8మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు వ చ్చింది గుండు సున్నా అని కెటిఆర్ విమర్శించా రు. తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఓడిపోయినా కెసిఆర్ మాత్రం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారని తెలిపారు.
అయితే అందరూ అలా అనుకోవడంతోనే కెసిఆర్ సిఎం కాలేకపోయారని కెటిఆర్ చెప్పుకొచ్చారు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చి న తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని మండిపడ్డారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖ త్వం అన్నారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసా న్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని చెప్పారు.
ALso Read: బిసి రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు