Saturday, June 3, 2023

ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి నిరుద్యోగ మార్చ్‌పై రాష్ట్ర మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదనీ, ఢిల్లీలో మోడీ ఇంటి ఎదుట చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులకు కెటిఆర్ సూచించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొ ద్దని యువత, నిరుద్యోగులకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో నిర్వహించిన బిఆర్‌ఎస్ ‘ప్రగతి నివేదన’ సభలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. 63 రోజుల పాటు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు పాదయాత్ర చేశారు. 95 గ్రామాల మీదుగా 775 కి.మీ. మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భం గా ‘ప్రగతి నివేదన’ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తీగల కృ ష్ణారెడ్డి సహా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ బిజెపి నాయకులు నిరుద్యోగుల కోసం ధర్నా లు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ సం వత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వా లి. సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నా బిజెపి నాయకుల్లారా కనీసం 18 లక్షల ఉద్యోగాలు మోడీ ఇచ్చిండా, నిరుద్యోగ మార్చ్, ఇక్కడ కాదు ఢిల్లీలోని నరేంద్ర మోడీ ఇంటి ముందు చేయాలని కెటిఆర్ సూచించారు.
మీ చిల్లర మాటలకు తెలంగాణ పడిపోదు
రైతుల ఆదాయం డబుల్ చేస్తనని మోడీ చెప్పాడు. కానీ రైతుల కష్టాలు డబుల్ అయ్యాయి. నల్లధనం ఎక్కడ అని అడిగితే తెల్లముఖం వేస్తున్నారు. దేశంలో ఎవరైనా అసమర్థత ప్రధాని ఉన్నారంటే అతను మోడీనే. మీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా లే వా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రంగ సం స్థలు అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు పాతర వేస్తలేరా..? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ మా తమ్ముళ్ల నోట్లో మట్టి కొడుతూ మీరు నిరుద్యోగ మార్చ్ చేస్తే నమ్మేందుకు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అని అనుకుంటున్నారా..? ఇది హుషారైన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. మీ చిల్లర మల్లర మాటలకు పడిపోయే తెలంగాణ కాదనీ, ఎవరు ఏందో మాకు తెలుసని కెటిఆర్ తెలిపారు.
బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు
మీ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ కొలువుల్లో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకు తీసుకొచ్చిన కెసిఆర్ మాకు అండగా ఉన్నారని కెటిఆర్ పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీకేజీ అయింది వాస్తవమే. వెంటనే ఆయా పరీక్షలను రద్దు చేశాం. జరిగిన నష్టానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. టీఎస్పీఎస్సీతో విద్యాశాఖకు, ఐటీ శాఖకు సంబంధం ఉండనే ఉండదని ఆయన తెలిపారు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. కేవలం నిధులు, కార్యదర్శి రూపంలోనే ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. ఇంత ఇంగితజ్ఞానం లేని వారు మన ప్రతిపక్షంలో ఉండటమనేది దురదృష్టకరమని కెటిఆర్ విమర్శించారు.
తమ్ముళ్లకు, చెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా…
రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తమ్ముళ్లకు, చెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. వాళ్లందరి కంటే ముఖ్యమంత్రికి, మాకు మీపై ప్రేమ ఉంది కాబట్టే తప్పులు జరగొద్దన్న ఉద్దేశంతో పరీక్షలను రద్దు చేశామని కెటిఆర్ స్పష్టం చేశారు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్నారు. జరిగిన లోటుపాట్లను సవరించుకుని బ్రహ్మాండంగా ముందుకు పోదామన్నారు. జరిగిన నష్టానికి అందరం చింతిస్తున్నామన్నారు. దయచేసి ఈ చిల్లరగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకోకండి. వాళ్ల కుట్ర మాకు తెలుసనీ ఆయన తెలిపా రు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన నాడే ఇదే బిజెపి నాయకులు మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దగ్గర కాకుండా కుట్ర చేస్తున్నారని ఆయన మా ట్లాడారు. అందుకే మొత్తం ఉద్యోగ నియామకాలకే పా తర వేసే కుట్ర జరుగుతుందన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియను ఆపే కుట్ర జరుగుతుందని, యువతను, నిరుద్యోగులను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని, దానికి లో ను కావద్దని కెటిఆర్ సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వాడే నిజమైన నాయకుడు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వ్య క్తికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చూడాలని సిఎం చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ దేశానికే పరిపాలన పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందని కెటిఆర్ తెలిపారు. స్వచ్ఛ గ్రామాలు, ఉత్తమ మున్సిపాలిటీ కేటగిరీల్లో రాష్ట్రానికే అధిక అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్ర తలసరి ఆ దాయం రూ.3.10 లక్షలకు పెరిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటు కానుందని కెటిఆర్ వెల్లడించారు. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని అపోహలు సృష్టించారని ఇప్పుడు హైదరాబాద్, పరిసర జిల్లాలు, ఇతర జిల్లా ల్లో భూములు ధరలు పెరిగాయని కెటిఆర్ స్ప ష్టం చేశా రు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 3 వేల మందికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News