Saturday, May 11, 2024

‘లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’

- Advertisement -
- Advertisement -

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా నుండి తమన్ సంగీత సారథ్యంలో ‘లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఫోక్ సాంగ్ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని మధురంగా ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, నదియా, రాజేంద్రప్రసాద్, వి.కె.నరేష్, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ, కమల్‌కామరాజు ప్రధాన పాత్రల్లో నటించారు.

Lacha Gummadi Gummadi Ra song out from Miss India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News