Sunday, April 28, 2024

నాగశౌర్య కొత్త చిత్రం షురూ

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగశౌర్య మంచి జోరుమీదున్నాడు. తమ సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ యంగ్ హీరో ఓ కొత్త చిత్రాన్ని బుధవారం ప్రారంభించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఐరా సంస్థ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నాగశౌర్యపై క్లాప్ ఇవ్వగా.. మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత నాగవంశీ స్క్రిప్ట్‌ని డైరెక్టర్ చేతికి అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ “నాగశౌర్య విభిన్న కథా చిత్రాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి హీరోగా అతను మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను”అని అన్నా రు. దర్శకుడు అనీష్ కృష్ణ మాట్లాడుతూ “పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్‌తో చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేయడానికి మంచి టీమ్‌తో సిద్ధమయ్యాను”అని చెప్పారు. నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ “నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నం.4 చిత్రాన్ని ప్రారంభించడం హ్యాపీగా ఉంది. డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ ముల్పూరి, సహ నిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ పాల్గొన్నారు.

Naga Shourya new movie Opening

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News