Sunday, April 28, 2024

వినోదం, రొమాన్స్‌తో పాటు యాక్షన్.. ‘రంగబలి’ టీజర్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న హోల్‌సమ్ ఎంటర్ టైనర్ ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మేకర్స్ అన్ని ప్రధాన పాత్రలు, బ్యాక్‌డ్రాప్ ను పరిచయం చేస్తూ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దూకుడు స్వభావం, లోకల్ ఫీలింగ్స్ వున్న హీరో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. తనని అందరూ విమర్శిస్తుంటే హీరోయిన్ మాత్రం తను చాలా సాఫ్ట్ అని భావిస్తుంది. హీరో తండ్రికి మెడికల్ షాప్ ఉంది. కానీ హీరోకి మెడిసిన్ కి సంబధించిన బేసిక్స్ కూడా తెలియవు.

హీరోయిన్ వృత్తిరీత్యా డాక్టర్. నాగశౌర్య తన పాత్రను అద్భుతంగా పోషించారు. గోదావరి యాసలో డైలాగులు చెప్పి అలరించారు. యుక్తి తరేజా కూల్‌గా కనిపించింది. సత్య, సప్తగిరి, ఇతర హాస్యనటులు తగిన వినోదాన్ని పంచారు. ఇందులో షైన్ టామ్ చాకో పాత్రను కూడా పరిచయం చేశారు. వినోదం, రొమాన్స్‌తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. పవన్ బాసంశెట్టి అన్ని కమర్షియల్ హంగులతో కూడిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News