Sunday, June 23, 2024

సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఆయన ఫాంహౌస్ సమీపంలో హత్య చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని మహారాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. సల్మాన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారును పాన్వెల్‌లోని ఆయన ఫాంహౌస్ సమీపంలో అడ్డగించి ఎకె 47 తుపాకులతో హత్య చేయాలని జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు కుట్రపన్నిందని వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగుకు చెందిన నలుగురు షూటర్లను పోలీసులు అరెస్టు చేయడంతో వారి కుట్ర భగ్నమైంది. షూటర్లను ధనంజయ్ తాప్‌సింగ్ అలియాస్ అజయ్ కాశ్యప్,

గౌరవ్ భాటియా అలియాస్ నహ్వి, వాస్పీ ఖాన్ అలియాస్ వాసిమ్ చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. ముంబై సర్కిల్ డిసిపి వివేక్ పన్సారే శనివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నలుగురు షూటర్లు ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌తోపాటు బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు కూడా జరిపారని డిసిపి తెలిపారు. ఈ విఫల హత్యాయత్నంలో 20 నుంచి 25 మంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News