Sunday, June 16, 2024

ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఎల్లుండి నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 26 నాటికి పశ్చిమ బెంగాల్ తీరానికి తుపాను చేరుకోనుంది. బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరణ కొనసాగుతోంది. ఇవాళ, రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఎల్లుండి తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News