Tuesday, April 23, 2024

వైన్ షాప్ లపై స్థానికులు దాడి

- Advertisement -
- Advertisement -

వైన్ షాపుల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని స్థానికుల ఆగ్రహం చెందిన స్థానికులు దాడి చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇల్లందు నియోజక వర్గం టేకులపల్లి లో చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు  3 దుకాణాలలో  దాడి చేసి 50 లక్షల విలువైన మద్యం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో స్థానికులు, బెల్ట్ షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. వైన్స్ షాపుల యజమానుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News