Saturday, April 27, 2024

గ్వాదర్ పోర్ట్‌పై బలూచ్ మిలిటెంట్ల దాడి… 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

చైనాపాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్ )లో భాగమైన పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్ట్‌పై దాడి జరిగింది. సాయుధులైన బలూచ్ తీవ్రవాదులు గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. పోలీస్‌లు, భద్రతా దళాలు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలో 8 మంది తీవ్రవాదులు మృతి చెందినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. పోర్ట్‌పై దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర వాదాన్ని ఏమాత్రం సహించబోమంటూ వ్యాఖ్యలు చేసిన మరునాడే ఈ సంఘటన జరగడం గమనార్హం. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టులను బలూచిస్థాన్ లోని అనేక గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ఏ వేర్పాటు వాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News