Monday, April 29, 2024

గురువారం రాశి ఫలాలు(21-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులు చకచకా సాగుతాయి. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి.

వృషభం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి

మిథునం –  పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు.

కర్కాటకం – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం

సింహం – మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

కన్య – ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.

తుల – భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు.

వృశ్చికం – కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు లాభం

ధనున్సు – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి.

మకరం –  సంతానంకు  నూతన ఉద్యోగ లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి.  ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

కుంభం – దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News