Tuesday, June 18, 2024

అధికారంలోకి వచ్చాక అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రక్షణ సర్వీసులలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తుందని, ప్రతి పేద మహిళ ఖాతాలో నెలకు రూ. 8,500 డిపాజిట్ చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. బీహార్‌లోని బక్తియార్‌పూర్ సోమవారం ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూలమికి అనుకూలమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని జోస్యం చెప్పారు.

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరిస్తుందని ఆయన తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జులై నుంచి మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ. 8,500 డిపాజిట్ చేస్తామని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తుందని ఆయన తెలిపారు. తనను దేవుడే పంపించాడంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తే తనకు ఏమీ తెలియదని, తనను దేవుడు పంపించాడని నరేంద్ర మోడీ సమాధానమిస్తారని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News