- Advertisement -
ధర్మశాల: ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. లక్నో ముందు 237 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఉంచింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పంజాబ్ బ్యాట్స్‌మెన్లు పభ్‌సిమ్రాన్ సింగ్(91), శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), జోష్ ఇంగ్లీష్(30), మార్కస్ స్టయినీస్(15), నెహాన్ వాధేరా(16) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఆకాశ్, దిగ్వేష్ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
- Advertisement -