Tuesday, April 30, 2024

రాహుల్ అజేయ శతకం

- Advertisement -
- Advertisement -

Lucknow solid win over Mumbai

ముంబైపై లక్నో ఘన విజయం

ముంబై: ఐపిఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింటిలోనూ పరాజయం పాలు కావడం గమనార్హం. మరోవైపు శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 18 పరుగుల తేడాతో ముంబైని ఓడించించి. ఈ గెలుపుతో లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

ఆరంభంలోనే..

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ బ్రెవిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బ్రెవిస్ 13 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేశాడు. అయితే ప్రమాదకరంగా మారిన బ్రెవిస్‌ను అవేశ్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (13) కూడా ఔటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కొద్ది సేపు పోరాటం చేశారు. ఇద్దరు లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కీల ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కీరన్ పొలార్డ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో (25), ఉనద్కత్ రెండు ఫోర్లు, ఒక బౌండరీతో 14 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్‌కు మూడు వికెట్లు దక్కాయి.

రాహుల్ జోరు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోకు ఓపెనర్ కెఎల్.రాహుల్ అండగా నిలిచాడు. మరో ఓపెనర్ డికాక్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. ఇటు డికాక్ అటు రాహుల్ పోటీ పడి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ధాటిగా ఆడిన డికాక్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే కూడా కెప్టెన్ రాహుల్‌కు సహకారం అందించాడు. సమన్వయంతో ఆడిన మనీష్ పాండే ఆరు ఫోర్లతో 38 పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. కెరీర్‌లో వందో ఐపిఎల్ మ్యాచ్‌ను ఆడిన రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్ 60 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో 9 ఫోర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో లక్నో స్కోరు 199 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News