Thursday, May 2, 2024

జపాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం!

- Advertisement -
- Advertisement -

టోక్యో: శుక్రవారం మధ్యాహ్నం 2:42 గంటలకు ఇషికావా ప్రిఫెక్చర్‌లో 10 కిలోమీటర్ల లోతులో షిండో (తీవ్రత) స్కేల్‌పై 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంపం సాయంత్రం 6.18 గంటలకు 20 కిమీ. (12 మైళ్ల) లోతులో తాకింది.

రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత భూకంపం జనాభా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగిస్తుందని భావించినప్పటికీ జపనీస్ మీడియా సంస్థలు మాత్రం ఇంత వరకు నష్టం, గాయాల గురించిన నివేదికలు అందించలేదు. ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సునామీ ముప్పు ఏమీ లేదని, అయితే సముద్ర మట్టంలో 20 సెమీ. కంటే తక్కువ మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. టోక్యోకు వాయువ్యంగా 300 కిమీ. దూరంలో ఉన్న జపాన్ తీరంలో ఇషికావా ప్రిఫెక్చర్ యొక్క నోటో ద్వీపకల్పం ఉత్తర కొనపై (నార్త్ టిప్) భూకంపం సంభవించింది. జపాన్‌లోని ఉత్తర దీవి హక్కైడోలో నెల రోజుల వ్యవధిలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 25న హక్కైడో తూర్పు ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News