Saturday, April 27, 2024

బాబ్లీ నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

 

బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల
తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు
నేడు శ్రీరాంసాగర్‌కు చేరుకోనున్న బాబ్లీ నీరు
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ, మహారాష్ట్ర ఇంజనీర్లు కలిసి బాబ్లీ గేట్లు ఎత్తి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 0.6 టిఎంసి నీటిని తరలిస్తున్నారు. ఈ మేరకు శ్రీరామంసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఇ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ అధికారులబృందం ఆదివారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టుకు చేరుకుంది. నాందేడ్ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ అధికారులుకూడా బాబ్లీకి చేరుకున్నారు. కేంద్ర జలవనరుల సంఘం అధికారుల సమక్షంలో మహారాష్ట్ర ఇంజనీర్లు బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టిఎంసి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు 14గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సుప్రీకోర్టు ఆదేశాలమేరకు ప్రతిసంవత్సరం బాబ్లీ గేట్లు తెరిచి 0.6 టిఎంసి నీటిని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గేట్లు తెరిచి శ్రీరాం సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు సోమవారం ఉదయం శ్రీరాంసాగర్‌కు చేరుకోనున్నాయి. అయితే గతసంవత్సరం వరకు శ్రీరాంసాగర్‌లో నీరు ఉండకపోవడంతో బాబ్లీనీటికి అత్యంతప్రాధాన్యత ఉండేది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 1080.10 అడుగుల నీరు ఉంది. ఈ నీటిని కాకతీయ కాలువకు విడుదల చేస్తూ బాబ్లీ నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నిలువ చేస్తామని అధికారులు చెప్పారు. బాబ్లీ నుంచి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా దిగువప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలవనరులసంఘం ఇంజనీర్ వెంకటేష్, ఎస్‌ఆర్‌ఎస్‌పి ఇ.ఇ.రామారావు, ఏపి ధవలేశ్వరం ఇఇ మోహన్‌రావు,సెంట్రల్ వాటర్ కమిషన్ ఇఇ గంగాధర్, మహారాష్ట్ర ఇఇ కెహాల్కర్ తదితరులు పాల్గొన్నారు.

Maharashtra Babli project Gates Open on orders of SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News