Saturday, April 27, 2024

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి జాతి నివాళి

- Advertisement -
- Advertisement -

Modi

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా గురువారం యావత్ జాతి మహాత్ముడిని స్మరించుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మహాత్మునికి నివాళులు అర్పించింది. కోవింద్, మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, గాంధీ స్మారక రాజ్‌ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడ సర్వమత ప్రార్ధన సమావేశం జరిగింది.

గాంధీజీకి అభిమాన భజన రఘుపతి రాఘవ రాజారాం ఒక వైపు వినిపిస్తుండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దేశ రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్, కేంద్రమంత్రి హరదీప్‌సింగ్ పురి, డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, తదితరులు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తుపాకీ వందనంతోపాటు స్కూలు విద్యారులు, వివిధ వర్గాల ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. త్రివిధ దళాల చీఫ్ రావత్, మూడు దళాల సర్వీస్ చీఫ్‌లు అడ్మిరల్ సునీల్ లంబా, ఎయిర్‌చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, జనరల్ మనోజ్ ముకుంద్ నరవనె హాజరయ్యారు.

Mahatma Gandhi Death Anniversary 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News