Thursday, May 9, 2024

హిట్ కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Tuck-Jagadish

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా తెరకెక్కనుంది. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ‘టక్ జగదీష్’ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఆ తర్వాత చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని కెమెరా స్విచాన్ చేశారు.

నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి అవుట్ డోర్ లొకేషన్లలో జరుగుతుంది. జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్.

Nani Tuck Jagadish Movie opening

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News