Saturday, April 27, 2024

నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు

- Advertisement -
- Advertisement -

Naga-Shourya

నాగశౌర్య కథానాయకుడిగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ’. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ “నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు.

గడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కిరీటం పెడితే కృష్ణుడిలా, క్యాప్‌పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాల సక్సెస్ సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది. నేను ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్ కుంటుంబ కథా చిత్రంగా అనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది”అని అన్నారు. యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ “ఈ చిత్రం నాకొక మంచి ఎమోషనల్ జర్నీ అని చెప్పగలను. ఇందులో కొత్త నాగశౌర్యను చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా చరణ్‌తేజ్ అందించిన సంగీతం శ్రోతలకు కనెక్ట్ అయింది. జిబ్రాన్ మంచి నేపథ్య సంగీతం సమకూర్చారు.

కష్టపడి ఈ సినిమాను నిజాయితీగా చేశాం. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు రమణతేజ మాట్లాడుతూ “నాగశౌర్య మంచి కథను అందించారు. నాగశౌర్య సపోర్ట్ మరువలేనిది. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే..ఓ మంచి కారణంతో తీశాం. ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్, నటుడు కాశీవిశ్వనాథ్, కెమెరామన్ మనోజ్, ఎడిటర్ గ్యారీ, డైలాగ్ రైటర్ పరశురామ్, కో డైరెక్టర్ అంకిత్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Naga Shourya Ashwathama Movie Release date

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News