Friday, April 26, 2024

బ్లాక్‌బస్టర్ పార్టీ కంటిన్యూస్…

- Advertisement -
- Advertisement -

Mahesh Babu

 

సూపర్‌స్టార్ మహేష్ బాబు పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అని ఇండస్ట్రీలో పేరుంది. పండగొచ్చినా పబ్బమొచ్చినా… ఆనందమొచ్చినా ఆయన ఏదీ దాచుకోడు. తాజాగా సంక్రాంతి రేసులో నిలబడి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. సంక్రాంతి సెలవులు కావడంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో మహేష్ బాబు తాజాగా తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితార, అనిల్ సుంకర తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి తీసిన సెల్ఫీని మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. మహేష్ సోషల్ మీడియాలో ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘బ్లాక్‌బస్టర్ పార్టీ కంటిన్యూస్.. సరిలేరు నీకెవ్వరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తనకు దక్కిన విజయాన్ని అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటో జోరుగా వైరల్ అవుతోంది.

Mahesh Babu is a complete family man
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News