Tuesday, October 15, 2024

బావకు ఉన్న సోయి బామ్మర్ధికి లేదు: మహేశ్‌కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బావకు ఉన్న సోయి బామ్మర్ధికి లేదన్నారు. కొండా సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను కెటిఆర్ ఎందుకు ఖండించలేదన్నారు. హరీష్‌రావుకు ఉన్న సామాజిక స్పృహ కెటిఆర్‌కు లేదన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారన్నారు. హైడ్రా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు తొలగించలేదని ఆయన తెలిపారు. మూసీ చుట్టూ ఉన్న వారికి చట్ట బద్దంగా నష్ట పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ వాళ్లు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సోషల్ మీడియా నడిపిస్తున్నారన్నారు. మధు యాష్కీ మాట్లాడిన మాటల్లో తప్పు లేదని ఆయన తెలిపారు.

హైడ్రా పేరు మీద ఒక్క రూపాయి వసూలు చేయలేదని, ఆరోపణలు కాదు దానిని నిరూపించాలని పిసిసి అధ్యక్షుడు బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని చెట్ల పేరు మీద, లిక్కర్, ఇరిగేషన్ పేరు మీద దోచుకున్నారని, బిఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేశారని ఆయన పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాహుల్ గాంధీకి హైడ్రాకు ఏమి సంబంధమని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. హైడ్రా వల్ల బిఆర్‌ఎస్ నేతలు బాధ పడుతున్నారని, 10 ఏళ్లలో బిఆర్‌ఎస్ నేతలు యథేచ్ఛగా కబ్జాలు చేశారని పిసిసి అధ్యక్షుడు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News