Saturday, April 20, 2024

డ్రగ్స్, సైబర్ నేరాలపై సమరశంఖం

- Advertisement -
- Advertisement -

నియంత్రణకు రెండు ప్రత్యేక విభాగాలు 4వేల మందితో బృందాల ఏర్పాటు
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కార్యాలయాలు
సివి ఆనంద్‌కు నార్కోటిక్, స్టీఫెన్ రవీంద్రకు సైబర్ సెక్యూరిటీ బాధ్యతలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిసున్న డ్రగ్స్, సైబర్ నేరాలు నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చే సింది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వి భాగాలను ప్రారంభించింది. దేశంలో మరేక్కడా లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ నివారణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను నెలకొల్పనున్నారు. ఈ రెండు విభాగాలను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ బుధవారం ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెండు విభాగాలు ఏర్పా టు చేశారు. టవర్ -బి లోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను, టవర్- బిలోని 2,3 అంతస్తుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ బ్యూరో అదనపు డిజిగా సి.వి. ఆనంద్‌కు అదనపు బాధ్యతలను అప్ప గించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజి గా స్టీఫెన్ రవీంద్రను నియమించారు.

డ్రగ్స్ వల్ల కలిగే నష్టాన్ని యువతకు ఈ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా అవగాహన కల్పిస్తారు. యువతకే కాదు డ్రగ్స్‌ను వాడుతున్న అందరికీ, ఈ డ్రగ్స్ ఊబిలో పడి జీవితాలను ఛిన్నాభిన్నం చే సుకుంటున్న పూర్తిగా డ్రగ్స్ బానిసలు అయిన వాళ్లకు ఈ బ్యూరోలో కౌన్సిలింగ్ ఇస్తారు. త ద్వారా వారిలో సత్ప్రవర్తనను రాబట్టే విధంగా చేస్తారు. విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను పట్టుకోవడం, అదే విధంగా ఆ దేశాల అ ధికారులతో సమాచారాన్ని పంచుకోవడం వం టివి చేస్తారు. అంతే కాకుండా రాష్ట్రాల్లోనూ ఇ క్కడ సమాచారాన్ని అక్కడికి మార్పిడి చేసుకుంటారు.

సైబర్ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్‌లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూ సుకుంటూ ఒకవేళ మోసాలు జరిగిన త్వరితగతిన కేసును ఛేదించడానికి ఉపయోగపడతా యి. దేశాన్ని కుదిపేసిన 67 కోట్ల మంది డే టా చోరీ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహ రించారు. ఆ సమాచారాన్ని చోరీ చేసిన సై బర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. అదే సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉంటే అంతర్‌రాష్ట్ర దొంగలను వేగంగా పట్టుకోవచ్చు. వారి సమాచారాన్ని ఆ రాష్ట్రాలకు వేగం గా చేరవేయవచ్చు. అదే కా కుండా ఇంకా సైబర్ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయుక్తం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News