- Advertisement -
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ దేవా కట్టా రూపొందించిన వెబ్‌సిరీస్ ‘మయసభ’. ఇందులో హీరో ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ వెబ్ సరీస్ ఓటిటిలో విడుదల చేశారు. ఓటిటి ‘సోనీలివ్’లో ఇది ప్రసారం అవుతుందని ప్రకటించారు. ముందుగా రేపటి(గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపిన మేకర్స్.. ఒక రోజు ముందుగానే ఇవాళ రిలీజ్ చేశారు. ‘సోనీలివ్’లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఐదు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ ను ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, దేవా కట్టా తన చివరి చిత్రం సాయిధరమ్ తేజ్ తో రూపొందించారు. దీని తర్వాత ఆయన ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు.
- Advertisement -