Tuesday, April 30, 2024

అమ్మల వన ప్రవేశం

- Advertisement -
- Advertisement -

మేడారం జనజాతర సమాప్తం

Medaram jatara in telugu

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణ కుంభమే ళాగా ప్రసిద్ధి చెందిన మేడా రం సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం మహా జాతర శనివారం సా యంత్రంతో ముగిసిం ది. నాలుగు రోజులపాటు వైభవంగా సాగి, భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు వనప్రవే శం చేశారు. అంతకు ముందు గద్దెల వద్ద ఇద్దర మ్మలకు గిరిజన పూజారులు సంప్రదాయబద్ధం గా పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యా లు, డప్పు చప్పుడుల నడుమ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. ఈ వనప్రవేశ ఘట్టంతో మేడారం మహాజాతర పరి సమాప్తమైంది. సమ్మ క్కను చి లుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, ఏటూరి నాగారం మండలం కొండాయికి గోవిందరాజు, పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనగొండ్లకు చేరుకున్నారు. వన దేవతల వనప్రవేశ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు గద్దెల వద్దకు చేరుకున్నారు.

నాలుగు రోజుల మహా జాతరలో భాగంగా బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల వద్దకు చేరుకుగా, వాగు సమీపంలోని గద్దె వద్దకు జంపన్న చేరుకున్నారు. కాగా, గురువారం సమ్మక్క కొలువు దీరింది. దీంతో నలుగురూ గద్దెలపైకి రాగానే జాతరకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు అమ్మలకు తమ మొక్కులను తర్చుకున్నారు. చీర, సారెలతోపాటు నిలువెత్తు బంగారం (బెల్లాన్ని) అమ్మలకు కానుకలుగా సమర్పించుకున్నారు. పక్షం రోజుల నుంచి మేడారం జాతరకు జనం పోటెత్తడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

ఇక్కడకు వచ్చే భక్తులు స్థానికంగా గుడారాలు వేసుకుని జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మలను దర్శించుకున్నారు. ఇందులో భాగంగానే అమ్మలకు గొర్రెలు, కోళ్లను బలిచ్చి తమ మొక్కబడులను తీర్చుకున్నారు. ఒకానొక దశలో జంపన్నవాగు తీర భక్తకోటితో మైమరచిపోయింది. కాగా, చివరి రోజు గద్దెల నుంచి వనాలకు వెళ్లే అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కొద్దిసేపు గద్దెల వద్ద దర్శనాలను నిలిపివేశారు. ఆ తర్వాత అమ్మల దర్శనాలను తిరిగి పునరుద్ధరించారు. నాలుగు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర వైభవోపేతంగా సాగింది. కరోనా విజృంభన నేపథంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాతరకు తగిన విధంగా నిధులిచ్చి ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సారి జాతరలో అమ్మవార్లను కోటి 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News