Monday, October 14, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేష రాశి ఫలితాలు

- Advertisement -
- Advertisement -

మేషం….

ఈ రాశి వారికి ఆదాయం –5 వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1.
గురుడు జన్మరాశి సంచారం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అయితే కొన్ని ఒత్తిడులు, ఆరోగ్యసమస్యలు ఎదురైనా ప్రభావం స్వల్పంగానే ఉంటాయి. ఇక అక్టోబర్వరకు గురు, రాహువుల కలయిక వల్ల కలిగే గురు ఛండాలయోగం వల్ల మానసికంగా అశాంతి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ నైపుణ్యం ,సమర్థతతో గౌరవాన్ని సంపాదించుకునే అవకాశాన్ని గురుడు ఇస్తాడు.

ఇక శని లాభస్థానంలో సంచారం అన్ని విధాలా శుభదాయకం. అలాగే, దుబారా ఖర్చులను తగ్గించుకుని పొదుపు మార్గాలు పాటిస్తారు. అక్టోబర్30 వరకు జన్మరాహువు, సప్తమంలో కేతువు కారణంగా మానసిక ఆందోళన. భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. వీరు పరస్పర అవగాహనతో మసలుకోవడం మంచిది. తదుపరి పరిస్థితులు చక్కబడతాయి. ఇక ఆదాయానికి ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. స్థిరాస్తులను సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. వారసత్వ ఆస్తులు కొన్ని లభించవచ్చు.

పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా ఫలితాలు పొందబోతున్నారు. సమాజసేవ, ధార్మిక కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రాంతి తీసుకోరు. అంత పట్టుదలతో ఉంటారు. మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మహిళలకు అన్నింటా విజయాలు చేకూరతాయి. వ్యాపారస్తులుు లాభాల స్థాయిని పెంచుకునేందుకు తగిన ప్రణాళికతో ముదుకు సాగుతారు. ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. వీరి పనితీరుని అధికారులు ప్రశంసిస్తారు. కొందరికి పదోన్నతులు కలుగవచ్చు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవేత్తలు మునుపటి కంటే మరింత చురుగ్గా అడుగులు వేస్తారు. రాజకీయవేత్తలకు కొత్త హోదాలు, పదవులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.

వీరికి కొన్ని అవార్డులు, పురస్కారాలు రావచ్చు. జూన్17 నుండి శని వక్రగతిలో సంచారం వల్ల నాలుగు నెలలు కొన్ని అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం పెంచుకుని మసలుకోండి. ద్వితీయార్ధంలో వివాహయత్నాలు కలసివస్తాయి. చైత్రం, వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

పరిహారాలు…నిత్యం హనుమాన్ఛాలీసా, ఆదిత్య హృదయం పఠనం చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News