Thursday, April 18, 2024

నుమాయిష్ సందర్శకులకు మెట్రోరైళ్ల రవాణా సేవలు

- Advertisement -
- Advertisement -

Hyderabad Metro Rail

నాంపల్లి : నుమాయిష్‌కు వస్తున్న సందర్శకుల సౌకర్యార్ధం మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ వారికి రవాణ సేవలను అందిస్తోంది. తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోనుంది.. ప్రతి రోజూ వేల సంఖ్యలో వస్తున్న జనానికి ఏ మాత్రం ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా రాత్రివేళలో వారి ఇళ్లకు త్వరితంగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నాంపల్లి గాంధీభవన్ మెట్రోరైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11 గం టల వరకు అదనపు మెట్రోరైళ్లను నడుపుతున్నారు. ఈ మేరకు మెట్రోరైల్ వర్గాలు, ఎగ్జిబిషన్ సొసైటీ మధ్య అవగాహన కుదిరింది. దీంతో ప్రత్యేక రైళ్లును నడిపేందుకు మెట్రోవర్గా లు అంగీకరించారని తెలిసింది. ఈ దిశగా నుమాయిష్‌లో రెండో చోట్ల మెట్రోరైల్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు.

సందర్శకుల సౌకర్యార్దం మెట్రోరైల్ టికెట్లు ఇందులోంచి తీసుకుని నేరుగా రైలులో ఎక్కి తమ గమ్యస్థలాలకు సురక్షితంగా, త్వరితంగా చేరుకొవచ్చు.. జంటనగరాలు, శివారు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఏటా నుమాయిష్‌ను సందర్శి ంచడం ఈ మేరకు.. అదనపు రైళ్లును నడుపుతున్నారు. కుటుంబసమేతంగా వస్తున్న వారికి మెట్రో వర్గాలు వెసులుబాటు కల్పించింది. నాం పల్లి గాంధీభవన్ నుంచి లక్డీకాపూల్ వైపు వెళుతున్న మెట్రోరైలు ద్వారా అమీర్‌పేట్, ఎర్రగడ్డ, మూసపేట్, కూకట్‌పల్లి మీదుగా మియాపూర్ వరకు వెళ్లవచ్చు.. ఇటువైపు చాదర్‌ఘట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్ తదితర చోట్లకు రైలులో ప్రయాణించవచ్చు… టికెట్లకు సంబంధించిన కౌంటర్లు నూమాయిష్‌లో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ సందర్శకులు ఇక్కడి నుంచే టికెట్లు కొనుగోలు చేసి తమ గమ్యస్థలాలకు చేరుకుంటున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో కూడా త్వరలో వెళ్లవచ్చు… సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ వర్గాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వం దల సంఖ్యలో ప్రత్యేక అదనపు బస్‌లు నడుపుతున్నారు. అక్కడికి బయలుదేరిన వా రిని మళ్లీ ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాతే ఆర్టీసీ బస్‌లను ప్రత్యేకంగా రాత్రి వే ళలో నడపునున్నారు. ఈ ది శగా తొలి ప్రయత్నాల్లో భాగంగా గాంధీభవన్ ప్రహరీగోడకు ఆర్టీసీ వర్గాలు చార్మినార్ నమూనాను స్టేజీని ప్రారంభించారు. నగరంలో పలు డిపోలకు చెందిన ఆర్టీస్ బస్సులను ప్ర త్యేక ంగా నుమాయిష్ సందర్శకుల సౌకర్యార్ధం ఏటా నడుపుతున్నారు.

నగరంలో సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, మె హిదీపట్నం, దర్గా, రాజేందర్‌నగర్, బండ్లగూడ, బాలానగర్, కూకట్‌ప ల్లి, బీహెఇఎ ల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, జీడిమెట్ల తదితర ప్రాంతాలకు త్వరలో సందర్శకులకు ఆర్టీసీ బస్‌లు అందుబాటులో తేనున్నట్లు తెలిసింది.. ఆయా ప్రాంతాలకు వెళ్లే వారిని పలు పాయింట్ల వద్ద నుంచి బస్‌లు బయలుదేరుతాయి. ప్రయాణీకులను ఆర్టీసీ బస్‌ల లో వారి గమ్యస్థలాలకు చేరుస్తున్నామని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

Metro Rail transport services for Numaish visitors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News