Saturday, April 20, 2024

సంక్రాంతి సంబురం

- Advertisement -
- Advertisement -

sankranti-festival

హైదరాబాద్: నగరం సంక్రాంతి శోభను సంతరించుకుంది… ఉదయం 6 గంటల సమయంలో ఏ వీధి చూసినా పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా మారాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా కూకట్‌పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్,ఎఎస్‌రావు నగర్ తదితర ప్రాంతాల్లో పూర్తి పల్లె వాతావరణం కనిపించింది. సాధారణ రోజుల్లో ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లలో చిన్నపాటి ముగ్గులతో సరిపెడతారు. కాని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగు, రంగులతో ముగ్గులు వేయడంతో అక్కడ ఆ హ్ల్లాదకర వాతావరణం ఏర్పడింది.

ముఖ్యంగా మంగళవారం భోగి పండగను పరస్కరించుకుని కాలనీల్లో, అపార్టుమెంట్‌లు, కూడళ్ళల్లో తమ ఇళ్ళలోని పాడైపోయిన కు ర్చీలు, తలుపులు, ఇతర సామగ్రితో భోగిమంటను వేసి దా ని చుట్టు నృత్యాలు చేస్తూ సంక్రాంతి పర్వదినానికి స్వా గతం పలికారు. చెడు రోజులు పోయి మంచి రోజులు రా వాలని కోరుతూ పాటలు పాడారు. అంతే కాకుండా సమీపంలోని దేవాలయాలకు వెళ్ళి ఈ సంవత్సరం అంతా మంచి జరిగేలా దీవించమని తమ ఇష్టదైవాలను మొక్కుకున్నారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నిర్వహకులు తమ వ్యాపార సముదాయల్లో పూర్తి పల్లెవాతవరణం కనింపించే విధంగా చేసి కోనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు సైతం భోగి స్పెషల్ పేరుతో ప్రత్యేక వంటకాలను తయారు చేసి‘ పల్లె రుచుల’ పేరుతో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారు.. ఈ విధంగా నగరంలో ఎవరికి తోచిన విధంగా భోగి పండగ ప్రత్యేకతను ప్రదర్శించండంతో నగరంలోని అనేక ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

makar Sankranti 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News