Home జాతీయ వార్తలు పదమూడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్..

పదమూడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్..

Minor Gangrape

 

గంజమ్: పదమూడేళ్ల ఓ మైనర్ బాలికపై మగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఒడిస్సాలోని గంజమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 10వ తేదీన నిందితులు.. ఇంట్లో ఉన్న బాలికను అపహరించి 36 గంటలపాటు అత్యాచారం చేశారు. ఈ నెల 12న నిందితులు బాలికను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇంట్లో నుంచి ఎత్తికెళ్లి.. జిల్లాలోని చికిటి ప్రాంతంలో బంధించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.  పోలీసులు ముందుగా బాలికను వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని, త్వరలోనే ఆమెను లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడుతామని బెర్హాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, పోస్కో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Minar Girl Gangraped in Ganjam District, Odisa