Friday, April 26, 2024

బిజెపి లేనే లేదు, కాంగ్రెస్ అడ్రస్సే లేదు: హరీష్

- Advertisement -
Harish Rao
మెదక్: టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వాళ్లని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూప్రాన్‌లో హరీష్ రావు రోడ్‌ షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేనే లేదని, కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే లేదని హరీష్ అన్నారు. వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పనిచేసేవారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, టిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ వాళ్ల వెంటపోతే ఎండమావులే ఎదురవుతాయని టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి పేర్కొన్నారు.
టిఆర్ఎస్ విజయంపై ఏమాత్రం సందేహం లేదన్న ఆయన… అధిక మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అభివృద్ధిలో తూప్రాన్ పరుగులు పెడుతోందని, తూప్రాన్‌ను రెవిన్యూ డివిజన్‌ చేసింది ముఖ్యమంత్రి కెసిఆర్ అని, తూప్రాన్‌ను పట్టణం చేయాలన్నదే సిఎం ఆలోచనన్నారు. తూప్రాన్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రూ.900 కోట్లతో రంగం సిద్ధమైందని హరీశ్ వెల్లడించారు. ప్రజల సమస్యలు, తెలిసిన, సమస్యలు తీర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఓటు వేద్దామని హరీష్ రావు ప్రజలకు  పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల్లో తెరపడనుంది. దీంతో ప్రచారాలతో పలు పార్టీల నేతలు హోరేత్తిస్తున్నారు.
Minister Harish Rao Election Campaign in Tupran
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News