Thursday, April 25, 2024

శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఫ్లైఓవర్‌ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఐటి కారిడార్, ఓఆర్ఆర్ ను అనుసంధానం చేస్తూ ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఐకియా మాల్ వెనుక మొదలై ఓఆర్ఆర్ పైకి ఫ్లైఓవర్‌ చేరనుంది. దీంతో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పుతో 4 వరసల ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. రూ.250 కోట్లతో రెండంతస్థుల ఫ్లైఓవర్‌ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఎస్ఆర్ డిపిలో భాగంగా చేపట్టిన పనుల్లో 17వ ప్రాజెక్ట్ పూర్తి అయింది. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News