Tuesday, March 5, 2024

ఇంట్లో గొడవలు.. తల్లి, ఐదుగురు కూతుళ్లు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother With Five Daughter Commits Suicide in chhattisgarh

రాయ్‌పూర్: కుటుంబంలో గొడవలు జరగడంతో ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బెంచా గ్రామంలో కేజవ్ రామ్ సాహు-ఉమా సాహూ అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కేజవ్ రామ్ ప్రతి రోజు మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో కుటుంబంలో ప్రతి రోజు గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమా తన కూతుళ్లతో కలిసి మహాసముంద్-బెల్సొందా మార్గంలోని కెనాల్ వంతెనపైన రైలు కింద పడి చనిపోయారు. రైల్వే అధికారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు కూతుళ్లు అన్నపూర్ణ (18), యశోద(16), భూమిక(14), కుంకుం(12), తులసి(10)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సిఎం భూపేశ్ బఘేల్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News